రికార్డు స్థాయిలో ‘108’ అంబులెన్సుల ప్రయాణం
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న ‘108’ అంబులెన్సులు రోజూ ఎంత దూరం తిరుగుతున్నాయో తెలుసా?. దాదాపు 70 వేల కిలోమీటర్లు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 426 అంబులెన్స్‌లు ఉన్నాయి. అంటే.. సగటున ఒక్కో అంబులెన్స్ రోజూ 164 కి.మీ. తిరుగుతున్నది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి జీవీకే ఈఎంఆర్ఐ (ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) విడుదల చేసిన గణాంకాల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఈ మూడు నెలల్లో రోజూ సగటున 8 వేల కాల్స్ వచ్చాయి.
సగటున రోజుకు 1,427, నెలకు 43,299 అత్యవసర సేవలు అందించాయి.
అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నెలకు 3 వేలకుపైగా సేవలు అందించాయి.
సెప్టెంబర్-నవంబర్ మధ్యలో నెలకు సగటున 4,267 మంది ప్రాణాలను రక్షించారు.
ఈఎంటీలు నెలకు సగటున 625 ప్రసవాలు చేశారు.
అత్యుత్తమ సేవలందించిన మంచిర్యాల జిల్లా దవాఖాన, నల్లగొండ జిల్లా దామరచర్ల పీహెచ్సీ, హైదరాబాద్ జిల్లా జంగమెట్ యూపీహెచ్‌సీలోని అంబులెన్సుల సిబ్బందికి ‘సేవియర్స్’ అవార్డులను అందజేశారు.