ఫార్మా కంపెనీలో తెలంగాణవాసుల తొలగింపు
స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్‌ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది.
- రెండువారాల్లో 200 మంది ఊస్ట్
- నార్త్ వారికే పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల మండిపాటు
- ఐటీ మంత్రి, కార్మిక శాఖకు ఫిర్యాదు
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్‌ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది. అదే సమయంలో ఉత్తరాది ఉద్యోగులకు పెద్దపీట వేస్తూ.. రాష్ర్టానికి చెందినవారిపై కత్తిగట్టడం చర్చనీయాంశంగా మారింది. పనిచేసేచోట సైతం యాజమాన్యం వేధింపులకు దిగుతున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొత్తూరు, శామీర్‌పేటలోని నాలెడ్జ్ స్కేర్ పార్క్‌లో ఉన్న సదరు ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఆగడాలు పెరిగిపోవడంతో ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
కిందిస్థాయి ఉద్యోగాల్లో మన రాష్ర్టానికి చెందినవారిని నియమించడం, అందులోనూ కొందరినే పర్మినెంట్ పొజిషన్లకు ఎంపిక చేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు చెందినవారిని అకారణంగా ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చడం, ప్రొబేషన్ పీరియడ్‌ను పెంచడం, పనితీరు సరిగ్గా లేదంటూ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఉగాది సహా ఇతర ముఖ్యమైన పండుగలకు సెలవులు ఇవ్వడం లేదని సిబ్బంది చెప్తున్నారు. రాష్ట్రం సిద్ధిస్తే అన్నిరంగాల్లో సమాన అవకాశాలు వస్తాయని భావించామని, కానీ తమ ప్రాంతంలోనే తీవ్ర వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యోగులతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మికశాఖ ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న వివక్ష, వేధింపులపై సమగ్ర విచారణ జరుపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

