ఎగరాలిరా మువ్వన్నెల జెండా
ఎగరాలిరా మన జెండా ఎగరాలిరా మువ్వన్నెల, ముచ్చటైన జెండా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎగరాలిరా మన జెండా ఎగరాలిరా
ఎగరాలిరా మన జెండా ఎగరాలిరా
మువ్వన్నెల, ముచ్చటైన జెండా
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు
ఎగరాలిరా మన జెండా ఎగరాలిరా
గగనాన మన జెండా ఎగురుచుండంగ
భగీరథ గంగ పారుచుండంగ
పాడిపంటలు చక్కగ పండుచుండంగ
కర్షకులు, కార్మికులు సంతోషించుచుండగ
భారతావని స్వర్గంభై విలసిల్లుచుండ ॥ఎ॥
జంబూ ద్వీపం భరతవర్షే భరతఖండే
పురాణాలలో పేరున్న పుణ్యదేశం
‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ
సర్వులను దీవించె సౌభాగ్య దేశం
భూత భవిష్యత్ వర్తమానాల ‘కాలచక్రం’
దినకరుడు తిరిగేటి ‘రాశిచక్రం’
మువ్వన్నెల మధ్యన ‘ధర్మచక్రం’
భారతావని ‘భాగ్యచక్రం’.॥ఎ॥
యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత
అంటూ స్త్రీలను గౌరవించే దేశం
దేశాన్ని మాతగా కొలిచేటి దేశం
లేదురా మనవంటి దేశంబు జగతి
ఐక్యమత్యములోనే దాగుంది ప్రగతి
శాస్త్ర విజ్ఞానాలతో మార్చాలిరా దేశ గతి
పింగళి వెంకయ్య రూపుదిద్దిన జెండా
తెల్ల దొరలనెల్ల వెల్లగొట్టిన జెండా
రజాకార్ల పీచమడిచిన మన జెండా
స్వాతంత్య్రానికి ప్రతీకగ నిలిచిన జెండా ॥ఎ॥
ఎగిరేటి జెండాల రెపరప గాలుల్లో
త్యాగాల గుండెల శ్వాసలున్నవి
అమరజవాన్ల పౌరుష సాహసాలున్నవి
అమరవీరుల పోరాట బాటలున్నవి
సమరయోధుల స్వాతంత్య్ర గాథలున్నవి
ఎవరో ఎత్తుతున్నారు పరాయి జెండాలు
మనలో దాగున్న కిరాయి గూండాలు
ముసుగేసిన గండాల అగ్ని గుండాలు
వాల్లకు వెయ్యాలిరా అరదండాలు ॥ఎ॥
శాంతి సహనాలకు కాక పెట్టిన కాలిపోతవు
కవ్వింపులు కాల్పులు భరిస్తున్న రాతిస్తంభాలం
హద్దు మీరితే డొక్క చీల్చేటి
ఉగ్ర నరసింహులం ॥ఎ॥
కాశ్మీరం భరత మాత ఫాలనేత్రం
కన్ను తెరిస్తే కాలి బూడిదవుతరు
‘ధర్మచక్రం’ మా తిరుగులేని పాశు పతాస్త్రం
విశ్వకవి రవీంద్రుని గీతం
జనగనమన మా నిత్య స్తోత్రం
‘సత్యమేవ జయతే’ మా నీతి సూత్రం
సూర్యచంద్రుల వెలుగులు వెలుగునందాక
నింగి హద్దుల దాక నిత్యము
ఎగరాలిరా మన జెండా ఎగరాలిరా
– పి.బక్కారెడ్డి
97053 15250
(జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి నేడు)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

