లారీ ఢీకొట్టడంతో నర్సింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. 13 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.
నకిరేకల్, డిసెంబర్ 12: లారీ ఢీకొట్టడంతో నర్సింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. 13 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేటలోని అపర్ణ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు నల్లగొండలోని ఆల్ఫా కాలేజీలో పరీక్ష రాసేందుకు బస్సులో సోమవారం ఉదయం బయల్దేరారు.
నకిరేకల్ బైపాస్ నుంచి తాటికల్ సర్వీస్ రోడ్డు వైపు బస్సు తిరుగుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కళాశాల బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 13 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలు కాగా, మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు నకిరేకల్, సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.