హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు .