Nagarkurnool | విద్యార్థినులు నవ్వారని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు..
Nagarkurnool | ఓ స్కూల్ అసిస్టెంట్ టీచర్.. విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. తనను చూసి నవ్వారని చెప్పి.. ఓ ముగ్గురు అమ్మాయిలను చెప్పుతో కొట్టి రాక్షసానందం పొందాడు.
Nagarkurnool | నాగర్‌కర్నూల్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు నవ్వారని చెప్పి.. తన చెప్పుతో కొట్టాడు ఉపాధ్యాయుడు. ఈ ఘటన అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగులపల్లి జడ్పీ హైస్కూల్లో వెలుగు చూసింది.
9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ ఉదయం స్కూల్ ప్రాంగణంలో ఆడుకుంటూ సరదాగా నవ్వారు. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి.. ఆ ముగ్గురు అమ్మాయిలు తనను చూసి నవ్వారని భావించి, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తన చెప్పు తీసుకొని.. ఆ ముగ్గురు విద్యార్థినుల పైకి విసిరికొట్టాడు. దీంతో విద్యార్థినుల మెడకు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత విద్యార్థినులు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఇక తల్లిదండ్రులు తరలివచ్చి.. స్కూల్ ఆవరణలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. డీఈవో ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈవో పేర్కొన్నారు.
విద్యార్థినులు నవ్వారని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు తనను చూసి నవ్వారని, చెప్పులు విసిరి కొట్టిన ఉపాధ్యాయుడు… pic.twitter.com/ZyqpL7Umub
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
ఇవి కూడా చదవండి..
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
Minister Seethakka | డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. Video
Mamta Kulkarni | కుంభమేళాలో సన్యాసం తీసుకున్న నటి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

