Mamta Kulkarni | ఉత్తరప్రదేశ్(UP) అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraaj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మాజీ నటి మమతా కులకర్ణి(Mamta Kulkarni) సన్యాసం తీసుకుంది. జనవరి 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్ (Mahamandelshwar)గా మారుతున్నట్లు ప్రకటించింది. తన జీవితం దేవుడికి అంకింతం ఇస్తూ.. ఇక నుంచి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకోచ్చింది. ఈ సందర్భంగా తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ఒకప్పుడు అగ్రతారగా వెలుగు వెలిగింది మమత కులకర్ణి. తాను నటించిన కరణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రేమ శిఖరంతో పాటు మోహన్ బాబు హీరోగా వచ్చిన దొంగా పోలీస్ చిత్రంలో నటించింది ఈ భామ. అయితే సడన్‌గా తాను నటనకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసింది. ఇక 20 ఏండ్ల క్రితం నటనను వదిలేసి విదేశాల్లో వెళ్లి స్థిరపడింది మమత.. తాజాగా మహకుంభమేళలో కనపడడం.. సన్యాసం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.