లక్ష్మీనారసింహుడికి అగ్గిపెట్టెలో బంగారు చీర
సిరిసిల్ల చేనేత కార్మికుడు తను తయారు చేసిన బంగారు పట్టు చీరను యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామికి సమర్పించారు.
- సిరిసిల్ల చేనేత కార్మికుడు విజయ్ బహూకరణ
- ఆలయ ఏఈవో రఘుకు పట్టుచీర, శాలువా అందజేత
యాదగిరిగుట్ట, అక్టోబర్31: సిరిసిల్ల చేనేత కార్మికుడు తను తయారు చేసిన బంగారు పట్టు చీరను యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామికి సమర్పించారు. మంగళవారం చేనేత కార్మికుడు విజయ్ అగ్గిపెట్టెలో ఒదిగిన బంగారు పట్టుచీర, స్వామివారికి పట్టుశాలువాను ఆలయ ఏఈవో రఘుకు అందజేశారు. స్వయంభూ నారసింహస్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తన తండ్రి నల్ల పరంధామయ్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించినట్టు చెప్పారు.
2 గ్రాముల బంగారాన్ని వినియోగించి 15 రోజుల పాటు శ్రమించి అగ్గిపెట్టెలో పొదిగే పట్టుచీరను తయారు చేశానని తెలిపారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పొదిగిన వస్ర్తాలను బహూకరించినట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్.. స్వామివారి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని, ఈ నేపథ్యంలో స్వామి, అమ్మవార్లకు స్వయంగా నేసిన పట్టుచీరను బహూకరించానని విజయ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

