బంజారాహిల్స్, జనవరి 11: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్‌చౌదరి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన సర్పంచ్ల ధర్నాలో సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి కించపరిచారని, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నారని, వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.