హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ముఖద్వారానికి పైన బాహుబలి డోమ్ను శుక్రవారం ఏర్పాటుచేశారు. సచివాలయానికి ఏర్పాటు చేసే డోమ్లలో ఇది (54 అడుగుల ఎత్తు) అతి పెద్దది. ఈ డోమ్ ఏర్పాటుకు కార్మికులు రెండు నెలలు శ్రమించారు. సచివాలయంలో మొత్తం 34 డోమ్లలో ఇప్పటివరకు 32 ఏర్పాటు చేశారు. ఈ బాహుబలి డోమ్ 33వది.
బాహుబలి డోమ్ ప్రత్యేకతలు