హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సు(సీఎస్ఈ) ప్రభ ఏమాత్రం తగ్గడంలేదు. ఈ సారి కూడా విద్యార్థులు సీఎస్ఈ కోర్సుకే జై కొట్టారు. ఎప్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్ఈ తత్సమాన కోర్సుల్లో 97.11% సీట్లు భర్తీ అయ్యాయి. ఎప్‌సెట్ మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లో 58,742 సీట్లుంటే, 57,042 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,700 సీట్లు మాత్రమే మిగిలాయి. ఎప్‌సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 95,256 మంది హాజరుకాగా, వీరిలో 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. మొత్తం అన్ని బ్రాంచీలు కలిపితే 83,054 సీట్లకు మొదటి విడతలో 77,561(92.89%) సీట్లు నిండాయి. కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో 16,793 మంది సీట్లను దక్కించుకోలేకపోయారు. పైగా 5,493 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. సీట్లు పొందిన వారు 22లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్‌చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 31 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్చేయకపోతే సీటును కోల్పోతారు.
హైదరాబాద్‌లో బెంట్లీ సిస్టమ్ సెంటర్!
హైదరాబాద్, జూలై 18: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సేవలు అందించే సాఫ్ట్వేర్ కంపెనీ బెంట్లీ సిస్టమ్స్..హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ డే ఉత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా బెంట్లీ సిస్టమ్స్ సౌత్ ఏషియా రిజినల్ ఎగ్జిక్యూటివ్ కమలకన్నన్ తిరువాడి మాట్లాడుతూ…తెలుగు రాష్ర్టాల్లో డిమాండ్‌ను బట్టి హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్‌ను నెలకొల్పే అవకాశాలున్నాయన్నారు.