హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో 95.78 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. బీపీఈడీలో 1,393 మంది, డీపీఈడీలో 871 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ర్యాంకర్లలో ఎస్సీ ఎస్టీల హవా
పీఈసెట్‌లో అత్యధిక ర్యాంకులను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సాధించారు. బీపీఈడీలో టాప్ 10లో ఏడు ర్యాంకులు, డీపీఈడీ 4 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. బీపీఈడీలో జీ క్రిష్ణమ్మ, శ్రీకాంత్‌నాయక్, స్వాతి, బుక్యా శాంత, ఎం మహేశ్, డీపీఈడీలో బదావత్ శివ, కే ప్రభాత్, ఎస్ రవళి,
కే పూజిత, జే నిరీష టాప్ ఐదు ర్యాంకులు
సాధించారు.