MLC Elections | హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో నామినేషన్ల ఉపసంహారణ గడువు తేదీ గురువారంతో ముగిసింది. దీంతో మొత్తం కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజక వర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 68 మంది అభ్యర్థులు దరఖాస్తులు ఉండగా.. వారిలో 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం 56 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే కరీంనగర్ టీచర్ నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారిలో ఒక్కరు తమ నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో 15 మంది బరిలో ఉన్నారు. నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి 21 మంది అభ్యర్థులకు అర్హులుగా పరిగణించగా.. వారిలో 3 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 19 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నట్లు సీఈవో పేర్కొన్నారు.