వనపర్తిలో బోల్తాపడిన వోల్వో బస్సు..
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు
వనపర్తి: వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.

అయితే.. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు అక్కడ అగింది. దీంతో దానిని వెనుకనుంచి డీసీఎం ఢీకొట్టింది. దానివెనుకే ఉన్న లారీ.. డీసీఎంను గుద్దింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

