చాక్లెట్ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
Warangal | వరంగల్‌లో విషాదం చోటుచేసుకున్నది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ గత కొంతకాలంగా వరంగల్‌లోని డాల్ఫిన్ గల్లీలో నివాసం ఉంటున్నారు.
వరంగల్: వరంగల్‌లో విషాదం చోటుచేసుకున్నది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ గత కొంతకాలంగా వరంగల్‌లోని డాల్ఫిన్ గల్లీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా, ఇటీవల కంగర్‌సింగ్ ఆస్ట్రేలియా వెళ్లొచ్చారు. ఆయన అక్కడినుంచి విదేశీ చాక్లెట్లు తీసుకొచ్చారు.
ఈ క్రమంలో శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా ఆ చాక్లెట్లను ఇచ్చారు. వారిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. గుర్తించిన పాఠశాల సిబ్బంది అతడిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు. అయితే గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన డాక్టర్లు.. చికిత్స అందిస్తుండగానే ఆ చిన్నారు మృతిచెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

