హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మట్టిబిడ్డ, ప్రజల కోసం పనిచేసిన దేశభక్త జర్నలిస్టు షోయబుల్లాఖాన్ 75వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) మంగళవారం ఘనంగా నివాళి అర్పించింది. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని సైతం లెకచేయకుండా జర్నలిజానికి అంకితమైన షోయబుల్లాఖాన్ పోరాట పటిమ నేటి తరం జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ కొనియాడారు. నిజాం నావాబు ప్రజాకంటక పనులను వార్తల రూపంలో లోకానికి చాటిచెప్పిన షోయబుల్లాఖాన్ తన ప్రాంత విముక్తి కోసం కంకణబద్ధుడై పనిచేశారని, అందుకే తెలంగాణ సమాజం ఆయనను నిరంతరం గర్తుచేసుకుంటూనే ఉంటుందని సంఘం ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతి సాగర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, యూనియన్ నాయకులు నవీన్ కుమార్ యార, సూరజ్ భరద్వాజ్, రమణ కుమార్, సుదర్శన్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.