జయశంకర్ భూపాలపల్లి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో చేపట్టిన టెస్టింగ్ పనులు 75 శాతం పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ, నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ బృం దం అన్నారం బరాజ్‌లో 40 రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నది.
వరద తాకిడి పెరగడంతో పరీక్షలకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం అన్నారం బరాజ్ అప్ స్ట్రీమ్‌లో 21 టెస్టులకు గాను 21, డ్రిల్లింగ్, డౌన్ స్ట్రీమ్‌లో 21 టెస్టులకు గాను 8, 11 డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యా యి. మొత్తం 75 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
అన్నారం బరాజ్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు వృథాగా పోతున్నది. కనీసం టీఎంసీ నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు లిఫ్ట్ చేస్తే రైతులకు కొంత ఉపశమనం కలిగేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2021లో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో సీ పేజ్‌లు ఏర్పడగా కెమికల్ గ్రౌటింగ్ చేసి రైతులకు సాగునీరు అందించారు. ప్రస్తుతం నీరు లేక రైతులు నార్లు పోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.