Medigadda | మేడిగడ్డకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 71,900 క్యూసెక్కులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు (Medigadda) వరద ప్రవాహం పెరుగుతోంది.
మహదేవపూర్, జూలై 3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు (Medigadda) వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం పెరుగుతున్నది.
బుధవారం బరాజ్ ఇన్ ఫ్లో 31,900 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, గురువారం ఉదయానికి అది 71,900 క్యూసెక్కులకు చేరింది. దీంతో బరాజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్‌లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.40 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

