Fee Reimbursement | ఫీజు బకాయిలు 7 వేల కోట్లు.. ప్రహసనంగా ఫీజు రీయింబర్స్మెంట్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
- డిగ్రీ, పీజీ కాలేజీలకే ఏడాదికి 750కోట్లు
- మూడేండ్లుగా నిలిచిపోయిన చెల్లింపులు
- సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నో
- ఉన్నతవిద్యకు పేద విద్యార్థులు దూరం
Fee Reimbursement | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు చెల్లిస్తున్నది. ప్రస్తుతం అందుకు సంబంధించిన నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ , సాలర్షిప్లను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50శాతం, చివర్లో మిగతా 25 శాతం చెల్లిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని పాటించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 5,500 కోట్లకు పైగా బకాయి పడగా, ఉపకారవేతనాలు కూడా కలుపుకొంటే దాదాపు రూ. 7 వేల కోట్లకుపైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
విద్యార్థుల అవస్థలు
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 10లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించని కారణంగా ప్రైవేటు యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరు అప్పులు చేసి ఫీజు చెల్లిస్తుండగా, ఆ స్థోమత కూడా లేనివారు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్తున్నారు. రీయింబర్స్మెంట్ చెల్లించకుంటే కాలేజీలు నడిపేదెలా అని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
విన్నవించినా స్పందించని సర్కారు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇటు విద్యార్థి సంఘాలు, అటు కాలేజీ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా సర్కారు స్పందించడం లేదు. నిధులు విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే నిధులను విడుదల చేయాలని అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా చలనం లేకుండా పోయింది. ఇటీవల పలు విద్యార్థి సంఘాలు, కులసంఘాల నేతలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం ప్రభుత్వానికి, మంత్రులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

