దేశంలో 6 కోట్ల మందికి సీవోపీడీ
దేశంలో దాదాపు 6 కోట్ల మంది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతున్నట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల ఏటా సుమారు 10 లక్షల మంది వరకు మరణిస్తున్నట్టు తెలిపారు. ఊపిరిత్తుల్లోకి పొగ, ఇతర కాలుష్య కారకాలు చేరడం వల్ల సీవోపీడీ బారిన పడుతున్నట్టు చెప్పారు.
- యశోద హాస్పిటల్స్ సదస్సులో వక్తలు
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలో దాదాపు 6 కోట్ల మంది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతున్నట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల ఏటా సుమారు 10 లక్షల మంది వరకు మరణిస్తున్నట్టు తెలిపారు. ఊపిరిత్తుల్లోకి పొగ, ఇతర కాలుష్య కారకాలు చేరడం వల్ల సీవోపీడీ బారిన పడుతున్నట్టు చెప్పారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సీవోపీడీ సమ్మిట్-2022’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలిసారి బ్రాంకోసోపిక్ థర్మల్ వేపర్ అబ్లేషన్ (బీటీవీఏ) విధానాన్ని, సీవోపీడీపై లైవ్ వర్షాప్ను నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 300 మందికిపైగా పరిశోధకులు, పల్మనాలజీ నిపుణులు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు.
మన దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో 10% సీవోపీడీ కారణంగానే సంభవిస్తున్నాయన్నారు. ధూమపానం, పారిశ్రామిక ధూళి, వాహనాల నుంచి వెలువడే పొగ, వ్యవసాయం ద్వారా రేగే దుమ్ము లాంటివి ఈ వ్యాధికి ప్రధాన కారణమని వివరించారు. సీవోపీడీ ఉన్నవారు దీర్ఘకాలిక దగ్గు, శ్వాస ఆడకపోవటం లాంటి సమస్యలతో బాధపడుతారని, ఇలాంటివారికి సకాలంలో సరైన చికిత్స చేయకపోతే ఊపిరితిత్తుల పనితీరు క్షీణిస్తుందని, అంతిమంగా శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వీ నాగార్జున మాటూరు, నిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ పరంజ్యోతి, ప్రొఫెసర్ వోల్ఫ్ గ్యాంగ్ హెచ్ స్మిత్ (జర్మనీ), ప్రొఫెసర్ క్రిస్టోఫర్ కూపర్ (అమెరికా), ప్రొఫెసర్ అనంతం దేవానందం (సింగపూర్), ప్రొఫెసర్ బింగ్ లామ్ (మలేషియా) తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- COPD
- country
- Yashoda Hospitals
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

