రామగిరి, ఆగస్టు 26: బాలికపై లైంగికదాడి ఘటనలో తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన నిందితుడు ఎస్కే ఖయ్యూంకు 51 ఏండ్ల జైలు, రూ.80వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు రెండో న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, అత్యాచారం అండ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్ రోజారమణి మంగళవారం తీర్పు వెల్లడించారు. 2021 నవంబర్ 3న తిప్పర్తి మండలానికి చెందిన ఓ ఎస్టీ బాలిక బస్‌స్టాప్ వద్ద వేచి ఉండగా షేక్ ఖయ్యూం బైక్‌పై వచ్చి ఆమెను బలవంతంగా బండి ఎక్కించుకున్నాడు. ఓ పాడుబడ్డ ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.