హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కెనరా బ్యాంకు నాలుగు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అవార్డులు గెలుచుకున్నది. బెస్ట్ టెక్నాలజీ టాలెంట్, బెస్ట్ టెక్నాలజీ బ్యాంకు, బెస్ట్ డిజిటల్ ఎంగేజ్మెంట్, బెస్ట్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ క్యాటరీల్లో పురస్కారాలు గెలుచుకున్నది. శనివారం ముంబైలో జరిగిన ఐబీఏ 18వ బ్యాంకింగ్ టెక్నాలజీ సదస్సులో కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ చంద్ర అవార్డులు స్వీకరించారు.