నల్లగొండ : సాధారణంగా సొరకాయ అడుగు నుంచి అడుగున్నర ఉంటుంది. కానీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పాశంవారిగూడెంలో 4 అడుగుల 7 అంగుళాల సొరకాయ కాసింది. పాశం వెంకట్రెడ్డి అనే రైతు ఇంట్లో రెండు నెలల క్రితం పెట్టిన చెట్టుకు కాత కాసింది. ఎరువులు, పురుగు మందులు వాడలేదు. అయినప్పటికీ ఒక సొరకాయ 4 అడుగుల పొడవుపైనే కాసింది. గత సంవత్సరం కూడా తమ పొలంలో ఒక్కో దోసకాయ 8 కిలోల వరకు పండిందని రైతు వెంకట్ రెడ్డి తెలిపాడు. 4 అడుగుల పొడవు పైనే కాసిన సొరకాయను చూసేందుకు ఆ ఇంటికి గ్రామస్తులు బారులు తీరారు.