Vikarabad | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన పెండ్లి బస్సు.. నలుగురు మృతి, 20 మందికి తీవ్రగాయాలు
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పరిగి: వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి దవాఖానకు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. పలువురిని హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కు రెఫర్ చేశారు.

బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులను అశ్విని, బాలమ్మ, మల్లేశ్, మంగలి సందీప్ కిషన్గా గుర్తించామన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవల్లి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

