Kalwakurthy | 33 కేవీ వైర్లలో చెలరేగిన మంటలు.. కల్వకుర్తిలో తప్పిన పెను ప్రమాదం
Kalwakurthy | కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యానగర్ కాలనీ మీదుగా వెళ్లిన 33 కేవీ వైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
Kalwakurthy | నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యానగర్ కాలనీ మీదుగా వెళ్లిన 33 కేవీ వైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో విద్యుత్ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యానగర్ కాలనీలో ఉన్న బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో ఉన్న 33 కేవీ వైర్లలో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రమాదం జరిగినప్పుడు వైర్ల కింద ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా మూడు చోట్ల వైర్లు తెగిపడ్డాయి. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలోనే కరెంట్ అధికారులు.. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 33 కేవీ లైన్ పునరుద్ధరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విద్యానగర్ కాలనీ మీదుగా ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను మార్చాలని స్థానికులు ఇప్పటికే ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. 33 కేవీ లైన్ తొలగింపు విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, కాలనీ మీదుగా ఉన్న ఆ విద్యుత్ లైన్‌ను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Army jawan | అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
SCR | ఆగస్టు 5 నుంచి 10 వరకు ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ల రద్దు.. ఎందుకంటే?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

