బ్రాస్బ్యాండ్ను పునరుద్ధరిస్తాం: డీజీపీ
రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పోలీసు బ్రాస్బ్యాండ్కు పాత రోజులు తీసుకొస్తామని, బ్యాండ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను రంగారెడ్డి జిల్లాలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో డీజీపీ ప్రారంభించి మాట్లాడారు.
- 27వ ఆలిండియా పోలీసు బ్యాండ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పోలీసు బ్రాస్బ్యాండ్కు పాత రోజులు తీసుకొస్తామని, బ్యాండ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను రంగారెడ్డి జిల్లాలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో డీజీపీ ప్రారంభించి మాట్లాడారు.
పోలీస్ బ్యాండ్లు కేవలం సంగీత బృందాలు మాత్రమే కావని, ఆయా బలగాల క్రమశిక్షణ, గుర్తింపు, గౌరవం, ఐక్యతకు ప్రతీకలని పేరొన్నారు. జాతీయ వేడుకలు, కవాతులు, గౌరవ వందనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వంటి కీలక కార్యక్రమాల్లో పోలీస్ బ్యాండ్ల పాత్ర ఎంతో విశిష్టమైనదని చెప్పారు. సంగీతానికి భాష, ప్రాంతం, సంసృతి వంటి భేదాలు ఉండవని, ప్రజలకు పోలీసులకు మధ్య అనుబంధాన్ని పెంపొందించే శక్తివంతమైన మాధ్యమమని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

