‘సమ్మక్క’కు సమ్మతించేనా..?
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ సమ్మతిస్తుందా? ఎన్వోసీని (నిరంభ్యంతర పత్రాన్ని) ఇచ్చేనా? అనే ఉత్కంఠ నెలకొన్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచే సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
- ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ ఇచ్చేనా..?
- నేడు ఆ రాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ సమ్మతిస్తుందా? ఎన్వోసీని (నిరంభ్యంతర పత్రాన్ని) ఇచ్చేనా? అనే ఉత్కంఠ నెలకొన్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచే సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఆ రాష్ట్ర సీఎంతో భేటీ కానున్నారు. దీంతో ప్రాజెక్టు అనుమతులపై సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. 50 టీఎంసీల గోదావరిజలాలు వినియోగించుకునేలా ఆ నదిపై తుపాకులగూడెం వద్ద 1.2కి.మీ పొడవుతో, 92మీటర్లు ఎత్తుతో, మొత్తంగా 6.94టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బరాజ్ (సమ్మక్క సాగర్)ను నిర్మించాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది.
బరాజ్ 83ఫీట్ల వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు తమ రాష్ట్రంలో ముంపు వాటిల్లుతున్నదని ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీ తీసుకువస్తేనే అనుమతులు మంజూరు చేస్తామని సీడబ్ల్యూసీ సైతం తెలంగాణకు సూచించింది. ఇటీవలనే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ సైతం వెనక్కిపంపింది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తామంటూ హడావుడి మొదలు పెట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

