హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారీ వేతన ప్యాకేజీని దక్కించుకొన్నారు. ఒక విద్యార్థి రూ. 24లక్షల వార్షిక వేతన ప్యాకేజీని సొంతం చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు రూ. 21 లక్షల ప్యాకేజీని అందుకొన్నారు. కాలేజీలో ఇటీవలే ప్లేస్మెంట్ డ్రైవ్ చేపట్టారు. పబ్బా నితిన్‌కుమార్ ఎంటెక్ (ఈసీఈ) విద్యార్థి రూ.24లక్షల వార్షిక వేతన ప్యాకేజీని సొంతం చేసుకొన్నాడు. చీమలపాటి ఆదిత్య శ్రీకర్, గట్ల దినేశ్‌రెడ్డి, శ్రీనివాసన్ శివప్రియ మ్యాథ్వర్క్ కంపెనీలో రూ.21 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని సొంతం చేసుకొన్నట్టు ప్రిన్సిపాల్ శ్రీరామ్వెంకటేశ్ తెలిపారు.