గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 13, 2020 , 17:26:44

‘గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం సమాయత్తమవ్వాలి’

‘గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం సమాయత్తమవ్వాలి’

జనగాం: వ‌చ్చే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిల‌కు అంతా స‌మాయత్తం కావాల‌ని టీఆర్ఎస్ శ్రేణులకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పాలకుర్తి మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 82 మంది లబ్ధదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి  పంపిణీ చేశారు.  అనంతరం పాల‌కుర్తి‌లోని త‌న‌ క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఎవ‌రు ఏ విధంగా వ్యవహరించాలో మంత్రి పార్టీ కార్యకర్తలకు వివ‌రించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలిచేలా ప‌ని చేయాల‌ని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo