గురువారం 09 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 11:09:44

ఊరూరా జోరుగా..ఆరో విడుత హరితహారం

ఊరూరా జోరుగా..ఆరో విడుత హరితహారం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఆయా జిల్లాల్లో మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి విరివిగా మొక్కలు నాటి రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ బల్కంపేట శ్మశాన వాటికలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీలోని పార్కు వద్ద మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మొక్కలు నాటి నీళ్లు పోశారు.


జోగులాంబ జిల్లా ఇటిక్యాలలోని బీచుపల్లి ఆలయ ప్రాంగణంలో మంత్రి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చలకూడలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీలు, రాజేశ్వర్, ఆకుల లలితతో కలిసి మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లాలో లకారం ట్యాంక్ బండ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ, బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు.logo