గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 16:40:31

ఆర్థిక ఇబ్బందులున్నా..రైతుబంధు

ఆర్థిక ఇబ్బందులున్నా..రైతుబంధు

మహబూబాబాద్:  లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి కేసీఆర్  రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో రైతు బంధు కోసం రూ. 7వేల కోట్లు కేటాయించారని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో  జిల్లా రైతాంగ సమస్యలు, రైతుబంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ లభ్యత-పంపిణీ, మిషన్ భగీరథ, తెలంగాణ సన్న రకాల పంటల ప్రోత్సాహంపై జిల్లా యంత్రాంగం, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

అనంతరం మంత్రి  మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎం కేసిఆర్ ఆలోచన మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందాలని ఏ ఒక్క మహిళ బిందె పట్టుకొని బయటకు రాకుండా మిషన్ భగీరథ  నీళ్లు అందేలా అధికారులు చూడాలన్నారు. వరి, మక్కల కొనుగోళ్లలో సేకరించిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి ఇచ్చే తెలంగాణ సన్న రకాలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. 


logo