హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి రైల్వే స్టేషన్లో అత్యంత దీనంగా రోజులు వెళ్లదీస్తున్న వృద్ధురాలు శకుంతల గురించి ‘అనాథగా అమ్మ!’ అనే శీర్షికతో ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై సోమవారం కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ చలించారు. ఆ వృద్ధురాలి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, ఆమెను వదిలేసిన కుమారుడు, కోడలిపై చర్యలు చేపట్టి సెప్టెంబర్ 22లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
‘పేగు లు బయటకి వచ్చేలా కరిచాయ్!’ అనే శీర్షికతో కుక్కకాట్లకు సంబంధించి మరో పత్రికలో వచ్చిన కథనంపై ఆయ న స్పందించారు. వ్యాక్సిన్ లభ్యత, వీధికుక్కల నివారణకు చేపడుతున్న చర్యలపై సెప్టెంబర్ 22లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.