మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 01:53:17

పేదలకు పక్కా ఇండ్లు ఒక్క తెలంగాణలోనే

పేదలకు పక్కా ఇండ్లు ఒక్క తెలంగాణలోనే

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదలకు పక్కా ఇండ్లను ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం, చీమలవారిగూడెం, కొత్త తండా, రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామాల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఈ గొప్ప పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 


logo