కాచిగూడ, మే 29: 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమ జేఏసీ కన్వీనర్ ఎస్ గో పాల్రావు కోరారు. బుధవారం నింబోలిఅడ్డాలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయా రు. పోలీసుల లాఠీదెబ్బలు, తుపాకీగుండ్లకు అనేక మంది దివ్యాంగులయ్యారని, వివిధ కేసుల్లో జైలుపాలై చాలా మంది దీనస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి కుటుంబాలు తమ సమస్యలను చెప్పుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.