CM Convoy | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఒకే నంబర్‌గల వాహనాలు దారుణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. సీఎం కాన్వాయ్ వాహనాలు కావడంతో వాటిని నడిపేవారు ఇష్టారీతిన, మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్నారు. కాన్వాయ్‌లో ఉన్నప్పుడు కాకుండా..
అర్ధరాత్రిళ్లు, పట్టపగలు ఇష్టారీతిన సెక్యూరిటీ లేకుండా సీఎం కాన్వాయ్ వాహనాలు తిరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. TG09 RR0009 నంబర్‌గల వాహనాలపై ఇప్పటివరకు మొత్తం 18 పెండింగ్ చలానాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.17,795. వీటిని ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.