హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీలాసెట్‌కు శుక్రవారం నాటికి 17వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. మూడేండ్ల లాసెట్‌కు 12,101, ఐదేండ్ల లాసెట్‌కు 3,917, పీజీలాసెట్‌కు 1,381 దరఖాస్తులు నమోదైనట్టు సెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మీ తెలిపారు. ఈ నెల 15న దరఖాస్తుల గడువు ముగియనున్నది.