హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీఫార్మసీ, ఫార్మా -డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్కు ఇప్పటివరకు 16,717 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తారు. సోమవారం నుంచి 7 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక సీట్లను ఈ నెల 11న కేటాయిస్తారు.