Manthani | వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం
పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు మంథనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మల్లారంలో మిర్చి ఏరేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మంథని- కాటారం ప్రధాన రహదారిపై నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాలీ స్టీరింగ్ రాడ్డు ఉడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో బొందల కిష్టమ్మ, అప్పల శైలజ, అప్పల వనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. మిగిలినవారిని పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

