Sriram Sagar | పూర్తిగా నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు.. 16 గేట్లు ఎత్తివేత
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది.
నిజామబాద్: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద (Floods) వస్తుంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. జిల్లాలో ఉన్న మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులోకి 12,285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 1278.3 అడుగులకు నీటిమట్టం చేరింది.
ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉన్నది.
కాగా, కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జుక్కల్-బస్వాపూర్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

