ఓటు కోసం 10.42 లక్షల దరఖాస్తులు
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
- కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు
- 10 కల్లా పరిశీలన, సిద్ధం కానున్న ఓటరు జాబితా
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 10 కల్లా ఓటరు జాబితాను తయారు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ చేసి అక్టోబర్ 4న జాబితాను ప్రచురించింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు హక్కు కోసం 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
కొత్తగా ఓటు హక్కు పొందిన వారందరికీ ఎన్నికల సంఘం ఉచితంగా ఓటరు కార్డును అందించనున్నది. అర్హులైన ఓటర్లకు పోస్టు ద్వారా ఓటరు కార్డును పంపించనున్నది. దీంతోపాటు ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఓటరు కార్డును డిజి లాకర్‌లోనూ భద్రపర్చుకునే అవకాశాన్ని సైతం కల్పించారు. ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకునే సందర్భంలో ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్, సీరియల్ నంబర్, పోలింగ్ తేదీ వాటితో క్యూఆర్ కోడ్‌ను ముద్రించి ఇస్తారు.
https://voterportal.eci.gov. in/login లేదా https://nvsp.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటరు పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఓటరు కార్డు నంబర్ లేదా ఫారం రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఆ తరువాత ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.
ఓటరు కార్డు ప్రత్యేకతలు ఇవే
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డును అకర్షణీయంగా తీర్చిదిద్దింది. బంగారు వర్ణంలో ఉండేలా తయారు చేశారు. ఈ కార్డును పీవీసీ షిట్ పై కలర్ ఫొటోను ముద్రించి ఇస్తున్నారు. ఓటరు కార్డుకు ఐఎస్వో గుర్తింపు కూడా లభించింది. 760 మైక్రాన్స్ మందంతో కార్డును తయారు చేశారు. కార్డును 86X54X0.76 మిల్లి మీటర్ల సైజ్‌లతో ముద్రించారు. ఈ కార్డును ఎన్నికల సంఘం కొత్తగా నమోదు అయ్యేవారికి, చిరునామా మార్చుకున్న వారికి, ఓటరు వివరాలను మార్చుకున్న వారికి ఇంటికే కార్డును పంపిస్తున్నారు.
ఓటరు కార్డు ముందు భాగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు, భారతదేశ రాజముద్ర, ఓటరు కార్డు నంబర్, నంబర్ కింద భాగంలో ఓటరు ఫొటో ఉంటుంది. ఫొటో పక్కన ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, పురుషులు లేదా స్త్రీలు, పుట్టిన తేదీ వివరాలను ముందు భాగంలో నమోదు చేశారు. వెనుక భాగంలో ఓటరు సంతకం, క్యూఆర్ కోడ్, ఓటరు కార్డు నంబర్, చిరునామా, ఓటరు కార్డు జారీ చేసిన తేదీని ముద్రించారు. ఓటరు కార్డుపై హోలో గ్రామ్ను ముదిస్తారు. హోలో గ్రామ్‌లో మోషన్ ఎఫెక్ట్, మల్టీ చానల్స్ ఎఫెక్ట్, ట్రూ కలర్ ఎఫెక్ట్, గ్రాడియెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మైక్రో సెక్యూరిటీ ఫీచర్స్, ఫోరెన్సిక్ పరంగా నానో సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఏర్పాటు చేశారు. హోలో గ్రామ్‌కు సీరియల్ నంబర్ ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

