హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఎలక్ట్రికల్, మైనింగ్ విభాగాల ఆధునికీకరణకు రూ. 92లక్షలు (1.10లక్షల డాలర్ల) విరాళాన్ని వర్సిటీకి అందజేశారు. 1960 బ్యాచ్ పూర్వ విద్యార్థి అయిన టెల్లా గోపాల్‌రావు, మైనింగ్ విభాగానికి లక్ష డాలర్లు, ఎలక్ట్రికల్ విభాగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పదివేల డాలర్ల విరాళం ఇచ్చారు.
సోమవారం వర్సిటీ అధికారులను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ మాట్లాడుతూ.. ఈ నిధులతో హాస్టల్ నిర్మాణం, ఏఐ వినియోగం, ల్యాబరేటరీలను అప్‌గ్రేడ్ చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ జీ నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.