శవాల మీది పేలాల మేత 150 కోట్ల స్కామ్
కార్మిక శాఖలో అమానవీయ దందా నడుస్తున్నది. బతికున్నవారినీ కాగితాల్లో ఖతం చేస్తున్నారు. సాధారణ మరణాలను ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి తనిఖీలు లేవు, వెరిఫికేషన్లు లేవు. బాధిత కుటుంబానికి అతాపతా లేకుండానే బీమా క్లెయిమ్‌లు జరిగిపోతు న్నాయి. ప్రభుత్వ పెద్దలు, దళారులు, ఏజెంట్లతో కూడిన ప్రత్యేక నెట్వర్క్ బీమా సొమ్ము స్వాహాకు పాల్పడుతున్నది.
- కార్మిక శాఖలో వికృత దందా
సాధారణ మరణాలకు ప్రమాద బీమా క్లెయిమ్‌లు - బతికి ఉన్నవారికి డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన ముఠా
- చనిపోయిన తర్వాత లేబర్ కార్డు.. ఆపై బీమా క్లెయిమ్
- ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే క్లెయిమ్‌లు మంజూరు
- రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీమా సొమ్ము స్వాహా
- ఎప్పుడో అంగవైకల్యం.. తాజాగా జరిగినట్టు దరఖాస్తు
- మంత్రి నుంచి వచ్చే సిఫారసు లేఖలే అర్హత పత్రాలు
- లేబర్‌కార్డు నుంచి క్లెయిమ్ వరకు ప్రత్యేక నెట్వర్
- 2018 కటాఫ్ నిబంధన వెనుక పకా దోపిడీ ఎత్తుగడ
- ఒక పెద్దపల్లి జిల్లాలోనే 520 అక్రమ క్లెయిమ్‌లు
- సూర్యాపేట జిల్లాలో 70% నకిలీవే
- నమస్తే తెలంగాణ పరిశోధనలో విస్తుపోయే నిజాలు
వర్ధెల్లి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) ‘కార్మిక సంక్షేమ నిధి’లో దోపిడీకి ఇవి మచ్చు తునకలు మాత్రమే. నిర్మాణ రంగ కార్మికుడి నెత్తురు జుర్రుతున్న బర్రె జలగల ఉదంతాలివి. కాసుల కక్కుర్తితో శవాల మీద పేలాలు ఏరుకుంటున్న వికృత దందాకు నిదర్శనాలివి. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ప్రాణం పోయినా, అంగ వైకల్యంతో మంచాన పడినా, సాధారణ మరణమే అయినా.. ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కార్మిక సంక్షేమ నిధిని అధికారులు, దళారులు కలిసి బరితెగించి కొల్లగొడుతున్నారు.
వీరికి రాజకీయ నేతలు అండగా నిలిచారు. లక్షో.. రెండు లక్షలో కాదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమ బోర్డు వేదికగా సాగిన దోపిడీ రూ.150 కోట్లపైమాటే. వేలాది మంది కార్మికులకు చెందాల్సిన డబ్బును తమ జేబుల్లో వేసుకున్నారు. నిజమైన కార్మికుడు ఫైలు చేతబట్టుకుని, కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా పైసా రాలడం లేదు. కానీ, దళారులు తెల్ల కాగితాలు పెట్టినా చాలు.. జెట్ స్పీడ్‌లో వేల మంది కార్మికుల ైక్లెయిమ్లకు రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తున్నాయి. కింది స్థాయి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్వో) నుంచి సీఈవో వరకు, అకడి నుంచి ఒక మంత్రి కార్యాలయం వరకు వ్యవస్థాగతంగా సిండికేట్‌గా ఏర్పడి సాగించిన ఈ వికృతదందాపై ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనాత్మక కథనం.
కక్కుర్తి దందాకు పెద్దపల్లి జిల్లా అడ్డా
ఈ కక్కుర్తి దందాకు పెద్దపల్లి జిల్లా అడ్డాగా ఉన్నట్టు తేలింది. ఈ జిల్లా పరిధిలోనే ఏకంగా సాధారణ, ప్రమాద మరణాలు, ఇతర బెనిఫిట్స్ కింద 520 అక్రమ క్లెయిమ్‌లు మంజూరైనట్టు ఆ శాఖ అంతర్గత పరిశీలనల్లో తేలింది. ఇది దందా వ్యాప్తికి అద్దం పడుతున్నది. సినిమాను తలపించేలా ఈ దందా సాగిస్తున్నట్టు తేలింది. ఈ ముఠా ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలోనే అనారోగ్యంతో, ఇతర కారణాలతో మరణించిన వారి వివరాలు సేకరించింది. వారికి పాత తేదీలతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించింది.
సాధారణంగా ప్రమాద బీమా మంజూరు కావాలంటే ఎఫ్ఐఆర్, శవ పంచనామా, పోస్టుమార్టం నివేదిక, డెత్ సర్టిఫికెట్, తహసీల్దార్ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్ ధ్రువీకరణ పత్రం, మెడికల్ బోర్డు ఇచ్చే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ పెద్దపల్లి జిల్లాలో ఈ నిబంధనలన్నింటినీ కాలరాశారు. ఒక పత్రం కూడా లేకుండా కేవలం తెల్ల కాగితాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేసి దాదాపు 520 మంది బీమా సొమ్మును స్వాహా చేసినట్టు కార్మిక శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది. పెద్దపల్లి పక్కన మంచిర్యాల జిల్లాలోనూ ఇదే తరహా దందా సాగినట్టు బయటపడింది. ఇక్కడ 84 క్లెయిమ్‌లను పరిశీలించగా, వాటిలో 74 దరఖాస్తుల్లో ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలో కూడా మంచిర్యాల కేంద్రంగా జరిగిన అక్రమాలకు ఆధారాలు లభించాయి.
సూర్యాపేటలో బతికున్నవాళ్లకు ‘డెత్’ క్లెయిమ్
సూర్యాపేట జిల్లాలో ఈ దందా మరింత వికృతరూపం దాల్చింది. కార్మిక శాఖ అధికారులు అంతర్గతంగా చేసిన ఆడిట్‌లోనే ఏకంగా 60 శాతం నకిలీ ైక్లెయిమ్లు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అధికారులు 50 క్లెయిమ్‌లను విచారించగా.. 30 క్లెయిమ్‌లు నకిలీ డెత్ సర్టిఫికెట్లతో దాఖలైనట్టు గుర్తించారు. దాఖలు చేసిన ఆయా మరణాలు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా గ్రామ పంచాయతీ రికార్డుల్లో పరిశీలించినప్పుడు వారంతా జీవించే ఉన్నట్టు తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఆ వ్యక్తి మరణించలేదని గ్రామ పంచాయతీ రికార్డులు చెప్తున్నప్పుడు.. మరణ ధ్రువీకరణ పత్రం ఎకడి నుంచి వచ్చింది? ఆ పత్రాన్ని ఎవరు అప్లోడ్ చేశారు? ఎవరు ధ్రువీకరించారు? క్లెయిమ్‌ను ఎవరు ఆమోదించారు? అనే విషయాలు మిస్టరీగా మారాయి.
సూర్యాపేటలోనే మరో విత్రమైన సంఘటన జరిగింది. ఇది కార్మిక సంక్షేమ బోర్డులోని అవినీతికి పరాకాష్ట. అంతర్గత తనిఖీ కోసం వెళ్లిన అధికారులు అనుమానాస్పదం అనిపించిన 80 క్లెయిమ్‌లను తిరిగి బోర్డు పరిశీలనకు పంపించారు. కానీ వాటిలో 42 క్లెయిమ్‌లను బోర్డు అధికారులు తిరిగి ఆమోదించినట్టు తెలిసింది. ఈ రెండు సంఘటనలకు సంబంధించి అధికారుల పరిశీలనలో ఏఎల్వోలు, నోడల్ అధికారులు ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే దరఖాస్తులను ఆమోదించి బోర్డుకు పంపినట్టు తేలింది. వాస్తవానికి క్లెయిమ్‌ల పరిశీలనలో అత్యంత కీలకమైన దశ క్షేత్రస్థాయి తనిఖీ. దరఖాస్తుదారు నిజంగా కార్మికుడేనా? ప్రమాదం నిజంగా జరిగిందా? కుటుంబ సభ్యులు ఎవరు? మరణం ఎకడ జరిగింది? వంటి అంశాలను స్థానికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి అధికారులు కార్మికుడి ఇంటి గడప తొకకుండా, ప్రమాద స్థలాన్ని చూడకుండా, గ్రామ రికార్డులను పరిశీలించకుండా, కేవలం ఆన్లైన్లో కనిపించిన పత్రాల ఆధారంగానే ప్రజాధనం విడుదల చేశారని నిర్ధారించారు. దీనికే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా బోర్డు ఆమోదం తెలిపిందని అంతర్గత తనిఖీల్లో తేలింది.
ఏఎల్వో నుంచి సీఈవో వరకు..
ఈ కక్కుర్తి వ్యవహారం ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైందా? అంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా సాగినట్టు తెలుస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఉదంతం, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తదితర అన్ని ప్రాంతాల్లో ఒకే తీరున మోసం జరిగినట్టు సమాచారం. సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో బయటపడిన నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, చనిపోయిన తర్వాత లేబర్ కార్డులు, ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా క్లెయిమ్‌లు వంటివే.. అధికారుల శాఖాపరమైన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా బయటికి వచ్చినట్టు తెలిసింది. ప్రతి క్లెయిమ్‌లో లేబర్ కార్డు ఎవరు ఇప్పించారు? డెత్ సర్టిఫికెట్ ఎవరు తెచ్చారు? మీసేవలో దరఖాస్తు ఎవరు చేశారు? ఏఎల్వో ఏం పరిశీలించారు? నోడల్ అధికారి ఎలా ధ్రువీకరించారు? బోర్డు నుంచి ఎలా ఆమోదించారు? బీమా సంస్థ నుంచి ఎవరి ఖాతాలోకి డబ్బు వెళ్లింది? అనేది ఒకే గొలుసులో సాగినట్టు గుర్తించారట.
ఈ స్థాయిలో అవినీతి కింది స్థాయి సిబ్బంది మాత్రమే చేయలేరని, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ) స్థాయి నుంచి మొదలుకుని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, కార్మిక సంక్షేమ బోర్డు సీఈవో, చివరకు సచివాలయంలోని మంత్రి కార్యాలయం వరకు అందరూ వాటాలు పంచుకున్న పకా వ్యవస్థాగత దోపిడీగా స్పష్టమవుతున్నది. నిబంధనల ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిన ఏఎల్వోలు కార్యాలయాల నుంచి బయటకు రాకుండానే సంతకాలు పెట్టారు. క్లెయిమ్ అర్హతలను పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు తెల్ల కాగితాలు ఉన్నాయని తెలిసి కూడా ఆమోదం తెలిపారు. ఏదైనా ఫైలు అనుమానాస్పదంగా ఉండి, ఎకడైనా ఆగిపోతే.. వెంటనే మంత్రి పేషీ నుంచి రికమండేషన్ నోట్ జారీ అయినట్టు తేటతెల్లం అవుతున్నది. రూ.లక్షల సంక్షేమ నిధులు బటన్ నొకి నిమిషాల్లో విడుదలవుతుంటే వ్యవస్థ అంతా కండ్లు మూసుకున్నదంటేనే.. అవినీతి గొలుసుకట్టు ఎంత ఎత్తుకు పాకిందో అర్థమవుతున్నది. ఫైలు ప్రారంభం నుంచి చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అడుగులోనూ ఎవరి వాటా వారికి పకాగా చేరినట్టు సమాచారం.
2018 కటాఫ్ వెనుక పకా రాజకీయ ఎత్తుగడ
ఈ కుంభకోణం బయటకు పొకడంతో రేవంత్ సరార్ ఆత్మరక్షణలో పడింది. దాదాపు మూడేండ్ల పాలనలోనే రూ.150 కోట్ల మేర దోపిడీ జరిగిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాప్పటికీ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ వేసింది. రాష్ట్రం ఏర్పడిన 2014 జనవరి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల్సింది పోయి, కేవలం 2018-19 నుంచే విచారణ అంటూ కటాఫ్ విధించింది. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ఎత్తుగడ. తమ ప్రభుత్వంలో ఏ తప్పూ జరుగలేదని, ఇదంతా గత ప్రభుత్వ పాపమేనని ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపేందుకే ఈ కుట్ర పన్నినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి జరిగిన అన్ని క్లెయిమ్‌లపై దర్యాప్తు చేయకుండా, సరిగ్గా 2018ని పరిమితిగా ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. గత పాలకులను ముందు పెట్టి, తమ ఏలుబడిలో సాగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే ఈ విచారణ అని స్పష్టమవుతున్నది.
లేబర్ కార్డులకు ప్రత్యేక ప్రైవేట్ వ్యవస్థ
ఈ మహా కుంభకోణం సాఫీగా సాగేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒక సమాంతర ప్రైవేట్ మాఫియా వ్యవస్థ పనిచేసినట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలో తేలింది. దీనికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రైవేట్ బ్రోకరేజీ కంపెనీ సహకరించినట్టు సమాచారం. భవన నిర్మాణ రంగంలో పని చేయని వ్యక్తులను, ఏండ్ల కిందటే దివ్యాంగులుగా మారినవారిని, చివరికి వృద్ధాప్యంతో మంచాన పడ్డ వారిని కూడా టార్గెట్ చేసి వారికి లేబర్ కార్డులు ఇప్పించేందుకు ప్రైవేట్ ముఠాలు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి. గ్రామాలు, పట్టణాల్లోని కొన్ని మీసేవ కేంద్రాలను తమ అదుపులోకి తీసుకొని, కనీస వెరిఫికేషన్ లేకుండానే వేల సంఖ్యలో గుర్తింపు కార్డులను జారీ చేయించారు.
కార్మికుడు స్వయంగా రావాల్సిన పనిలేకుండా, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, అవసరమైన చోట తప్పుడు వేలిముద్రలు వేయిస్తూ ఈ ప్రైవేట్ నెట్వర్ చక్రం తిప్పింది. ఈ వ్యవస్థకు అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ నేతల ఆశీస్సులు పుషలంగా లభించాయి. ఒకో కార్డు ఇప్పించడానికి, ఆ తర్వాత దానిపై నకిలీ ప్రమాదం సృష్టించి బీమా క్లెయిమ్ చేయించడానికి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడుకున్నారు. పరిహారంగా వచ్చే మొత్తంలో సింహభాగం ఈ ప్రైవేట్ దళారులే గుంజుకుని, సంబంధిత వ్యక్తుల కుటుంబాలకు కేవలం నామమాత్రపు చిల్లర విదిల్చేవారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ప్రైవేట్ నెట్వర్ వెనుక అధికార పార్టీకి చెందిన పలువురు నాయకుల బినామీలే ఉన్నారని చెప్తున్నారు.
కక్కుర్తి-1

కార్మిక శాఖ ఆన్లైన్ లావాదేవీల్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పోలెపాక పాణి. భవన నిర్మాణ కార్మికుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దామెర మండలం ఊరుగొండ. 2025 నవంబర్‌లో అనారోగ్యంతో మరణించాడు. ఆరు నెలల తర్వాత ఇల్లు సర్దుతుండగా ఆయన లేబర్ కార్డు బయటపడింది. దీంతో సహజ మరణం కింద వచ్చే రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఆయన భార్య సరోజన మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టల్‌లో వివరాలు అప్లోడ్ కాలేదు.
దీంతో ఆమె తన కొడుకును వెంటబెట్టుకుని హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమ భవన్‌కు వచ్చి అధికారులను ప్రశ్నించారు. అకడ లాగిన్ రికార్డులు పరిశీలించగా, బాధితులకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. పాణి చనిపోయిన రెండు నెలలకే, అంటే 2026 జనవరి 12న ఆయన పేరు మీద ప్రమాద మరణం (యాక్సిడెంటల్ డెత్) కింద రూ.6.30 లక్షల బీమా సొమ్ము మంజూరై, వేరే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎవరో గుర్తు తెలియని దళారీ 2026 జనవరి 9న దరఖాస్తు చేసుకుంటే, ఎలాంటి విచారణ లేకుండానే వాయువేగంతో కేవలం మూడు రోజుల్లోనే (జనవరి 12న) క్లెయిమ్‌ను ఆమోదించేశారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పాణి భార్యకు దకాల్సిన పరిహారాన్ని, అధికారులతో చేతులు కలిపిన దళారీ ముఠా దర్జాగా కాజేసింది.
కక్కుర్తి-2

ఇది కూడా కార్మిక శాఖ ఆన్లైన్ లావాదేవీల ఫొటోనే. ఇందులో నలుగురు వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి కదా.. వీళ్లు నిజమైన కార్మికులు. వారు దేనికి అర్హులో, అదే బెనిఫిట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏ పైరవీ లేని నిర్భాగ్యులు కావడంతో అధికారులు వీళ్ల ఫైళ్లు ముట్టుకున్న పాపాన పోలేదు. మొదటి పేరు దుర్గం రాజలింగు. సాధారణ మరణం కింద దరఖాస్తు చేసుకుని నేటికి 475 రోజులు అయ్యింది. రెండో వ్యక్తి ఆకుదరి పవన్ కల్యాణ్ సాధారణ మరణం దరఖాస్తు 421 రోజులు దాటింది. నవాడి వరలక్ష్మి కూతురు మొదటి కాన్పు బెనిఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని 345 రోజులు దాటింది. మేదపట్ల వెంకటేశ్ తన భార్య మొదటి కాన్పు బెనిఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని 324 రోజులు అవుతున్నది. వీళ్లకు పైరవీకారుల అండ లేకపోవడంతో ఏండ్లకేండ్లు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
కక్కుర్తి-3

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఊట్ల నర్సవ్వ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం. 2015లో కరీంనగర్ లేబర్ కార్యాలయం నుంచి లేబర్ కార్డు తీసుకున్నారు. ఆమెకు 2020 నుంచి మతిస్థిమితం తప్పింది. 2023లో మరణించింది. ఒక మంత్రి పేరు చెప్పుకుని వచ్చిన వ్యక్తులు 2026 ఏప్రిల్ 18న ఆమె పేరు మీద యాక్సిడెంటల్ డెత్‌గా దరఖాస్తు చేసుకున్నారు. అదే నెల 23న ఆమె బీమా సొమ్ము రూ.6.30 లక్షలు ైక్లెయిమ్ చేశారు. ఆమె నామినీ ఊట్ల గంగోలి. ఆయన పేరు మీద అకౌంట్ తీసినట్టు, అందులో డబ్బులు జమ అయినట్టు లావాదేవీలు చూపిస్తున్నాయి. కానీ విచిత్రంగా ఈ మొత్తం సొమ్మును బ్యాంకు చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్టు చూపిస్తున్నది. ఇదే గన్నేరువరానికి చెందిన దొమ్మాటి కొమురవ్వ సాధారణ మరణాన్ని ప్రమాద మరణంగా చూపించి రూ.6.30 లక్షలు ైక్లెయిమ్ చేశారు. ఆమె నామినీ ఆనంద్‌కు రూ.70 వేలు వచ్చాయని చెప్పి, రూ.30 వేలు ఇచ్చినట్టు బాధితుడు తెలిపాడు.
మంత్రి సిఫారసు లేఖలే అర్హత పత్రాలు

రూ.150 కోట్ల కుంభకోణంలో ఒక మంత్రి భాగం కావడం అత్యంత వివాదాస్పదమైన, విస్మయపరిచే అంశం. ఆయన కార్యాలయం నుంచి వచ్చిన సిఫారసు పత్రాలే అక్రమారులకు కొండంత అండగా మారాయి. ఇందుకు పెద్దపల్లి జిల్లాకు చెందిన నూనె శ్రీనివాస్ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనకు 76 శాతం శాశ్వత వినికిడి లోపం ఉన్నట్టు కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన వైద్యులు నిర్ధారించి, 2019 మే 9న యూడీఐడీ ధ్రువీకరణ పత్రం జారీచేశారు. ఆయన 2023 మార్చి 28న కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యుడిగా చేరాడు.
ఆశ్చర్యకరంగా.. 2026 ఏప్రిల్ 16న బీమా పరిహారం కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. తాను 2024 ఫిబ్రవరి 17న జరిగిన ప్రమాదంలో గాయపడ్డానని కట్టుకథ అల్లాడు. 50 శాతానికి పైగా శాశ్వత అంగవైకల్యం పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు వత్తాసుగా మంత్రి తన అధికారిక లెటర్ హెడ్‌పై సిఫారసు లేఖ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 17న కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి స్వయంగా నోట్ కూడా పంపారు. అందులో సదరు క్లెయిమ్ తిరసరణకు గురైందని చెప్తూనే, నిబంధనలను పకనపెట్టి ప్రాధాన్యత క్రమంలో తక్షణమే దాన్ని మంజూరు చేయాలని ఆదేశించడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

