రోజుకు ఐదు లక్షల పారాసెటమాల్ గుటుక్కు

- కొవిడ్ సెకండ్ వేవ్లో మొత్తం 4.81 కోట్ల వినియోగం
- 32 లక్షల మంది కరోనా, కరోనేతర బాధితులకు చికిత్స
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు వాడే పారాసెటమాల్ వినియోగం కరోనా కారణంగా రెట్టింపు అయినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ సంబంధిత లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని భావించే ఈ ఔషధాన్ని ప్రభుత్వం కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించే కిట్లలో చేర్చింది. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారాసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో మొత్తం 4.81కోట్ల గోలీలను వినియోగించారు. వీటి ద్వారా కోవిడ్, కోవిడేతర వ్యాధుల బాధితులు 32 లక్షల మంది దాకా చికిత్స పొందారు. వీటికి ఎలాంటి కొరత రాకుండా వైద్యారోగ్యశాఖ ప్రతి 10 రోజులకు ఒకసారి కోటి గోలీల చొప్పున దవాఖానల్లో రీస్టాక్ చేసింది. ఇదే కాలానికి 1.03 లక్షల లివోసిట్రజిన్ గోలీలను ప్రజలు వేసుకున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 15,249 ఎన్-95 మాస్కులు, 34,221 సర్జికల్ మాస్కులు, 59 వేల సర్జికల్ గ్లోవ్స్, తదితర వైద్య పరికరాల వినియోగం జరిగినట్టు గణాంకాలు స్పష్టంచేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

