పీవీ ప్రపంచస్థాయి నాయకుడు

- మారిషస్ పీవీ శత జయంత్యుత్సవంలో కేకే
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచస్థాయి నాయకుడని రాజ్యసభసభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పారు. శనివారం ఆన్లైన్ ద్వారా మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కేకే మాట్లాడుతూ.. ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తేవడం, సంస్కరణలకు బీజం వేయడం పీవీ నైజమని చెప్పారు. ఆయన కృషివల్లే ప్రస్తుతం దేశం ఈస్థాయిలో ఉన్నదని తెలిపారు. పీవీ కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవీ మాట్లాడుతూ.. పీవీ తన విద్వత్తోనే రాజకీయరంగంలో విజయం సాధించారని చెప్పారు. పీవీ ఖ్యాతిని ఈ తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు పీవీ మార్గదర్శిగా నిలుస్తారని పేర్కొన్నారు. పరిపాలన, సిద్ధాంతాల్లో విమర్శల్ని లెక్కచేయని వ్యక్తిత్వం పీవీ సొంతమని పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు చెప్పారు. మారిషస్ సహా వివిధ దేశాల్లో పీవీ విగ్రహాల ఏర్పాటుకు కృషిచేస్తామని ఎన్నారై కన్వీనర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

