హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌గా ఎస్ రాంచందర్ నియమితులయ్యారు. షీప్ ఫెడరేషన్ ఎండీగా ఉన్న రాంచందర్‌ను ఎఫ్ఏసీ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు రాంచందర్ కృతజ్ఞతలు తెలిపారు.