రైస్‌మిల్లులో భారీ అక్రమాలు?
నారాయణపేట జిల్లా నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద ఉన్న సాయిరాం రైస్ మిల్లులో భారీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.
- రూ.10.92 కోట్ల ధాన్యం పక్కదారి
- మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు
నర్వ, అక్టోబర్ 18 : నారాయణపేట జిల్లా నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద ఉన్న సాయిరాం రైస్ మిల్లులో భారీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వం 2022-25 వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యానికి మిల్లులో ఉన్న నిల్వలకు భారీగా తేడాలు ఉన్నట్టు శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పక్కదారి పట్టిన బియ్యం విలువు రూ.10.92 కోట్ల ఉంటుందని గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై రమేశ్‌ను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారులు బియ్యం సరఫరా విషయంలో అక్రమాలు జరిగినట్టు తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

