Medicine from the Sky | తెలంగాణలో ఇక డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మెడిసిన్స్ సరఫరా.. అనుమతిచ్చిన కేంద్రం
Medicine from the Sky | తెలంగాణలో శనివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. ఇందుకు కేంద్రం నుంచి తుది అనుమతులు లభించాయి.

Medicine from the Sky | తెలంగాణలో శనివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. ఈ మేరకు కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర పౌర విమానయానశాఖ (ఎంవోసీఏ) నుంచి చివరి అనుమతులు లభించాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్), నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపోలో హాస్పిటల్స్) భాగస్వామ్యంతో ఐటీఈ &సీ విభాగం అనుబంధ ఎమర్జింగ్ టెక్నాలజీస్, తెలంగాణ ప్రభుత్వ ఇన్షియేటివ్తో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతున్నది.
వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఇలా..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి డ్రోన్ ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల రవాణాను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ఎంపిక చేసిన బ్లూడార్ట్ మెడ్ ఎక్స్‌ప్రెస్ కన్సార్టియం (స్కై ఎయిర్), హెలికాప్టర్ కన్సార్టియం (మారుత్ డ్రోన్స్), క్యురిస్ ఫ్లై కన్సార్టియం (టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్) సంస్థలు ఇప్పటికే వికారాబాద్‌కు చేరుకున్నాయి. వ్లోస్, బీవీలోస్ డ్రోన్ ఫ్లైట్లతో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి.
కేంద్ర మంత్రి సింధియా, రాష్ట్రమంత్రి కేటీఆర్ చేతుల మీదుగా..
శనివారం జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, నీతి ఆయోగ్ సీఈవో రాజీవ్ కుమార్, అపోలో గ్రూప్ జాయింట్ ఎండీ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎయిరోస్పేస్ అండ్ డ్రోన్స్ ఇండియా లీడ్ పాల్గొన్నారు. బీవీలోస్ డ్రోన్లతో హెల్త్‌కేర్ పరికరాలు, వ్యాక్సిన్లు, ఔషధాలు సరఫరా చేయడం దేశంలోనే తొలిసారి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

