నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8604 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6556 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32074 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 65430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 883.40 అడుగుల వద్ద 206.5365 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 46313 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.