బారాత్‌లో పెళ్లికూతురు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్: కొన్ని రోజుల నుంచి వాట్సాప్‌లో ఓ డ్యాన్స్ వీడియో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. పెళ్లి బారాత్‌లో పెళ్లికూతురు చేసిన డ్యాన్స్.. వాట్సాప్ యూజర్లను తెగ మెస్మరైజ్ చేస్తోంది. బుల్లెట్ బండి ఫోక్ సాంగ్‌కు ఆ నవవధువు వేసిన స్టెప్పులు అందరికీ థ్రిల్ పుట్టిస్తున్నాయి. కేక పుట్టిస్తున్న ఆ డ్యాన్స్ చేసిన అమ్మాయిది మంచిర్యాల జిల్లా. వాట్సాప్ స్టార్‌గా మారిన ఆమె పేరు పయ్యావుల సాయి శ్రియ. ఆమె సొంత వూరు జన్నారం మండలంలోని పొంకాల గ్రామం.
నిజానికి బుల్లెట్ బండి పాటను మోహనా బోగరాజ్ పాడారు. అయితే పెళ్లి బరాత్‌లో తన భర్తను సర్ప్రైజ్ చేసేందుకు శ్రియ ఆ పాటను ఎంచుకున్నది. ఇక డ్యాన్స్‌లో లీనమై తన స్టెప్పులతో భర్తను ఫిదా చేసేంది ఆ బ్రైడ్. ఆగస్టు 14వ తేదిన శ్రియ .. జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అకుల అశోక్‌ను పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత జరిగిన బారాత్‌లో పెళ్లి దుస్తుల్లోనే ఆ అమ్మాయి తన డ్యాన్స్ కళను ప్రదర్శించింది.
ఆ పెళ్లి ఊరేగింపుకు హాజరైన ఓ మిత్రుడు తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నది. వాట్సాప్ గ్రూపుల్లో ఆ వీడియో క్షణాల్లో లక్షల్లో షేర్ అవుతోంది. ఆ బ్రైడ్ చేసిన డ్యాన్స్ వీడియోను టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి. దీంతో ఆ అమ్మాయి పాపులారిటీ పెరిగిపోయింది. పెళ్లి బారాత్‌లో తన్మయత్వంతో నృత్యం చేసిన శ్రియ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఆమె పాపులారిటీని మరింత పెంచేస్తున్నారు.
ఒక్క డ్యాన్స్ వీడియోతో స్టార్ అయిపోయిన శ్రియ తండ్రి ఆ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. తమ బంధువుల్లో ఒకరు ఆ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేసినట్లు తండ్రి రాము తెలిపారు. ఆ వీడియో క్లిప్ 2.27 నిమిషాల నిడివి ఉంది. డ్యాన్సర్ శ్రియ చిన్నతనం నుంచే నాట్యం నేర్చుకున్నట్లు తండ్రి తెలిపాడు. స్కూల్‌తో పాటు ఎన్నో డ్యాన్స్ పోటీల్లో ఆమె ప్రైజ్‌లు గెలిచినట్లు చెప్పాడు. ఇక తాజా బారాత్ డ్యాన్స్ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ నరహరి తన ట్విట్టర్లో ట్యాగ్ చేయడం విశేషం. ఈ నవవధువు తన వరుడి కోసమే నిజమైన న్యాటం చేసిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మీరూ ఈ వీడియోలో ఆ డ్యాన్సింగ్ బ్రైడ్‌ను చూడండి..
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

