ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతుంది. 42 వేల క్యూసె క్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఆయకట్టు, త్రాగునీటి పథకాలకు నీటి విడుదల జరుగుతోంది. ఎడమ కాలువకు 820 క్యూసె క్కులు, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150, నెట్టంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయంత్రానికి 9.214 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇదిలా ఉండ గా విద్యుతుత్పత్తికి 45,431 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో 12 యూనిట్ల ద్వారా విద్యుతుత్పత్తి నిర్వహిస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వార 4.918 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 241.458 మి.యూ ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.968 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 267.219 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 48,119 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.